Mon Nov 25 2024 17:55:29 GMT+0000 (Coordinated Universal Time)
ప్రగతి భవన్ లో సోదాలు చేయాలి : షర్మిల
గత కొన్నిరోజులుగా తన పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో గవర్నర్ కు వివరించానని షర్మిల తెలిపారు.
గత కొన్నిరోజులుగా తన పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో గవర్నర్ కు వివరించానని షర్మిల తెలిపారు. ఆమె రాజ్‌భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నర్సంపేటలో తమ పార్టీకి చెందిన వాహనాలకు నిప్పంటించిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. శాంతిభద్రతల సమస్య సాకుగా చూపించి తనను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకు వచ్చారన్నారు. పాదయాత్ర చేస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారన్నారు. తన మీద దాడి జరిగితే పోలీసులదే బాధ్యత అని ఆమె తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తికి రాయబోతున్నానని ఆమె తెలిపారు.
నేను తెలంగాణ బిడ్డనే...
తాను టీఆర్ఎస్ గూండాల దాడిలో ధ్వంసమయిన వాహనాలను కేసీఆర్ కు చూపించాలని వస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తాను వాహనంలో ఉండగానే అలాగనే పోలీసు స్టేషన్ కు తీసుకు వచ్చారన్నారు. పోలీసులు కూడా తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నానని తెలిపారు. ప్రగతి భవన్ లో సోదాలు నిర్వహిస్తే వేల కోట్ల రూపాయల నగదు బయటపడుతుందని ఆమె అన్నారు. తన పాదయాత్రను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంానికి వేల కోట్ల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపారు. కేటీఆర్, కవిత ఇళ్లపై దాడులు చేయాలన్నారు.
Next Story