Fri Dec 20 2024 10:24:49 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ కు మరో షాక్.. ఆయన కూడా రాజీనామా!!
బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస షాక్ లు తగులుతూ
బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస షాక్ లు తగులుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఛోటా నాయకుల నుండి బడా బడా నేతలు కూడా వైదొలుగుతూ ఉన్నారు. వీలైతే స్టేట్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకో.. లేదంటే భారతీయ జనతా పార్టీలోకో చెక్కేస్తూ ఉన్నారు. తాజాగా మరో ఎంపీ బీఆర్ఎస్ ను వీడారు.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రాసిన రాజీనామా లేఖలో, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీకి సేవ చేయడానికి తనను అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జహీరాబాద్ నుంచి రెండుసార్లు అవకాశం కల్పించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా లేఖను తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన షేర్ చేశారు. బీబీ పాటిల్ 2014, 2019లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. పాటిల్ బీజేపీలో చేరారు.
Next Story