Mon Dec 23 2024 01:43:03 GMT+0000 (Coordinated Universal Time)
సింగరేణిలో రాజుకున్న ఎన్నికల వేడి
సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంది. 14 కార్మిక సంఘాలు నామినేషన్లు దాఖలు చేశాయి. ఓ వైపు కోర్టు విచారణ మరోవైపు ఎన్నికల..
సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంది. 14 కార్మిక సంఘాలు నామినేషన్లు దాఖలు చేశాయి. ఓ వైపు కోర్టు విచారణ మరోవైపు ఎన్నికల ప్రక్రియ కోల్ బెల్ట్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఉత్తర తెలంగాణ ఆరు జిల్లాల్లో విస్తరించిన వున్న సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకుంది. గత నెల 27న విడుదలైన షెడ్యూల్ ప్రకారం సంస్థకు చెందిన 14 రిజిస్టర్డ్ కార్మిక సంఘాలు శుక్ర, శనివారాల్లో నామినేషన్లను దాఖలు చేశాయి. ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణ ..10న తుది జాబితా ప్రకటించి పోటీలో నిలిచిన సంఘాలకు గుర్తులను కేటాయిస్తారు. ఇక 28న పోలీంగ్. ఇక అదే రోజుల ఫలితాలప్రకటన ఉంటుంది.
సింగరేణిలో ఏడవ దఫా జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణపై మొదటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంటూ వస్తోంది. ఎన్నికల వాయిదాను కోరుతూ యాజమాన్యం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది. ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే, మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో AITUC మూడుసార్లు, TBGKS రెండు సార్లు,INTUC గెలుపొందాయి. ఇప్పుడు ఏడోసారి ఎవరు విజయం సాధిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. కోర్టు తీర్పుపై ఓ వైపు ఉత్కంఠ కొనసాగుతోన్న మరోవైపు కార్మిక సంఘాలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.
మొత్తంగా ఈనెల 11న కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎన్నికల కోలాహాలం ఊపందుదకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన TBGKS తో పాటు ప్రధాన రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. సింగరేణిలో జరిగే ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుండడంతో, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగి తమ అనుబంధ సంఘాల గెలుపు కోసం విస్తృత ప్రచారాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
Next Story