Fri Dec 20 2024 05:40:35 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేత
సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేటి నుంచి మూతపడనున్నాయి. ఈ మేరకు తెలంగాణలో థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయించింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేటి నుంచి మూతపడనున్నాయి. ఈ మేరకు తెలంగాణలో థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయించింది. నేటి నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేయాలని నిర్ణయించింది. కొత్త సినిమాలు లేకపోవడం కూడా థియేటర్లు మూసివేయడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
పది రోజుల పాటు...
అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇప్పుడు నడుస్తున్న షోలకు ప్రేక్షకుల నుంచి ఆశించిన ఆదరణ రావడం లేదు. కనీసం కరెంటు బిల్లులు కూడా రావడం లేదని థియేటర్ల యాజమాన్యం వాపోతున్నారు. ఒక్క షో కూడా ఫుల్లు కాకపోతుండటంతో నష్టాల్లో నడిపే కంటే మూసివేయడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చి పది రోజుల పాటు నేటి నుంచి మూసివేయనున్నారు.
Next Story