Mon Dec 16 2024 07:00:47 GMT+0000 (Coordinated Universal Time)
Barrelakka : హైకోర్టును ఆశ్రయించిన బర్రెలక్క
తెలంగాణ హైకోర్టులో శిరీష అలియాస్ బర్రెలక్క పిటీషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
తెలంగాణ హైకోర్టులో శిరీష అలియాస్ బర్రెలక్క పిటీషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఎన్నికలయ్యే వరకూ తనకు 2 + 2 గన్ మెన్ లను కేటాయించాలని కోరుతూ శిరీష పిటీషన్ దాఖలు చేసింది. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శిరీష బరిలోకి దిగారు. ఆమె బర్రెలక్కగా సోషల్ మీడియాలో అందరికీ సుపరిచితం అయ్యారు.
రక్షణ కల్పించాలని కోరుతూ...
ఇటీవల ఆమె సోదరుడిపై కొందరు దాడి చేశారు. దీంత ఆమె తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. ప్రచారంలో తనకు ఆదరణ లభిస్తుండటంతో ఇతర పార్టీల అభ్యర్థులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని కూడా తెలిపింది.
Next Story