Thu Nov 28 2024 16:50:11 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డికి "సిట్" నోటీసులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధకారులు నోటీసులు జారీ చేశారు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తమ వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాలంటూ సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఒకే మండలంలో చాలా మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆధారాలు చూపాలంటూ...
ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ లీకేజీ ఘటనపై ఆరోపణలు చేసిన వారందరికీ నోటీసులు జారీ చేసి ఆధారాలను ఇవ్వాలని సిట్ కోరనుందని తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలిసింది. ఆధారాలు తమకు అందిస్తే దానిపై విచారణ జరుపుతామని సిట్ అధికారులు అంటున్నారు.
Next Story