Fri Nov 15 2024 06:19:56 GMT+0000 (Coordinated Universal Time)
Bhadrachalam : భద్రాద్రిలో నేడు సీతారామ కల్యాణం
భద్రాచలంలో నేడు సీతారామచంద్రుల కల్యాణం జరగనుంది. భద్రాచలంలోని రామాలయంలోని మిథిలా స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు
భద్రాచలంలో నేడు సీతారామచంద్రుల కల్యాణం జరగనుంది. భద్రాచలంలోని రామాలయంలోని మిథిలా స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్యాణాన్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు. ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిన్న రాత్రి అనుమతిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా...
దీంతో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు భద్రాద్రి సీతారాముల కల్యాణాన్ని తిలకించే వీలు కలిగింది. ఇప్పటికే భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బంది పడకుండా చలువ పందిళ్లతో పాటు కూలర్లను కూడా ఏర్పాటు చేశారు. మంచినీటిని అందుబాటులో ఉంచారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మజ్జిగను కూడా పంపిణీ చేస్తున్నారు. కన్నుల పండువుగా జరిగే సీతారామ కల్యాణం మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
Next Story