Mon Dec 23 2024 07:01:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
తెలంగాణలో నేడు ఆరుగురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకరం చేయిస్తారు.
తెలంగాణలో నేడు ఆరుగురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆరుగురు ఎమ్మెల్సీల చేత ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకరం చేయిస్తారు. ఇటీవలే గవర్నర్ కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీలు ఎన్నికయిన సంగతి తెలిసిందే. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రొటెం స్పీకర్.....
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి, కలెక్టర్ గా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన వెంకట్రామిరెడ్డికి పెద్దలసభలో అవకాశం కల్పించారు. వీరంతా నేడు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Next Story