Mon Dec 23 2024 04:17:50 GMT+0000 (Coordinated Universal Time)
గద్వాల జిల్లాలో విచిత్రం.. బాలిక కంటి నుండి బియ్యం, రాళ్లు
ఓ బాలికకు కళ్లలో నుండి నీటితో పాటుగా.. బియ్యపు గింజలు, చిన్న చిన్న రాళ్లు బయటికొస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన..
ఇంద్రియాణాం నయనం ప్రధానం" ఇంద్రియాలన్నింటిలో కన్ను అత్యంత ప్రధానం. శరీర భాగాలన్నింటిలోనూ మన కళ్లే చాలా సున్నితమైనవి. ఎవరికైనా కళ్లలో నుండి నీళ్లు రావడం సహజం. కానీ ఓ బాలికకు కళ్లలో నుండి నీటితో పాటుగా.. బియ్యపు గింజలు, చిన్న చిన్న రాళ్లు బయటికొస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని గద్వాల జిల్లాలో వెలుగుచూసింది. బియ్యం, రాళ్లు వస్తుండటంతో ఆ బాలిక నొప్పి భరించలేక పోతుంది. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడుకు చెందిన రంగన్న - ల్మి దంపతులకు దీపాలి(11) అనే కూతురు ఉంది. రెండు, మూడ్రోజులుగా దీపాలి కళ్లలో నుండి చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటికొస్తున్నాయి.
చిన్నారి నొప్పి భరించలేకపోతుండటంతో.. తల్లిదండ్రులు కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ దీపాలికి వైద్యులు అన్ని పరీక్షలు, స్కానింగ్ లు చేసి.. సమస్యేమీ లేదని చెప్పారు. దాంతో చేసేదేమీ లేక కూతుర్ని తీసుకుని ఇంటికొచ్చేశారు. 15 నిమిషాలకు ఒకసారి బియ్యపు గింజలు, రాళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. రోజుకి పాప కంటి నుంచి 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటకు వస్తున్నాయి. పాపకు ఎక్కడ చికిత్స చేయించాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Next Story