Mon Dec 23 2024 15:08:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇత్తడి బిందెలో నాగుపాము.. అందరూ హడల్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని రెండో వార్డులో ఓ ఇంట్లో నాగుపాము చొరబడింది. అయితే అది అటూ.. ఇటూ తిరిగి చివరికి ఇత్తడి బిందెలో దూరింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో ఉలిక్కిపడిన కుటుంబం పాము బయటకు రాకుండా బిందెపై బండరాయిని ఉంచారు. ఉదయం లేవగానే బిందె రోడ్డుపైకి తీసుకువచ్చి పాములు పట్టే వాళ్లకు అప్పగించారు. నాగుపామును పట్టే వ్యక్తి చాకచక్యంగా పామును చేతిలో పట్టుకున్నాడు.
నాగుపాము ఇంట్లో ఉండడంతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపామని కుటుంబ సభ్యులు తెలిపారు. నాగుపాము ఇంట్లో చొరబడడంతో తెల్లవారుజాము వరకు కంటికి కునుకు లేకుండా గడిపామని తెలిపారు. పాము బిందెలో ఉందని తెలుసుకున్నాక.. ఆ బిందె పై బండను పెట్టి దానిని కదలకుండా చేశామని తెలిపారు. నాగుపామును పాములు పట్టే వ్యక్తులు సమీపంలోని అటవీప్రాంతంలో వదిలివేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story