Mon Dec 23 2024 14:44:38 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్ లో
కరోనా.. ఈ మహమ్మారి ఇప్పటికే చాలా మందిని బలి తీసుకుంది. ఇంకా బలి తీసుకుంటూనే ఉంది. కరోనా దాహానికి లక్షలాది మంది బలయ్యారు. కరోనా వచ్చి కోలుకోలేక కొంతమంది బలైతే.. కరోనా వచ్చిందన్న భయంతో మరికొంతమంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే.. హైదరాబాద్ లోనూ జరిగింది. కరోనా వచ్చిందని మానసిక వేదనతో కుంగిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read : చిరంజీవికి కేసీఆర్ ఫోన్.. త్వరగా కోలుకోవాలంటూ..
వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్ లో నివాసం ఉంటోంది. ఈ నెల 21వ తేదీ అలేఖ్యకు అస్వస్థతగా ఉండగా.. కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుంది. పరీక్షల్లో పాజిటివ్ గా తేలగా.. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని ఫోన్లో చెప్పగా.. వారు ధైర్యం చెప్పారు. కానీ.. రెండ్రోజుల తర్వాత.. ఈనెల 23వ తేదీ సాయంత్రం తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి అలేఖ్య నివాసానికి వచ్చి పరిశీలించగా.. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. అలేఖ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story