Thu Jan 09 2025 15:07:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎంపీలు ఆ ముగ్గురూ గెలిచారు.. ఈ ముగ్గురూ ఓడారు
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన పార్లమెంటు సభ్యుల్లో కొందరు ఓడిపోగా, మరికొందరు గెలుపొందారు
తెలంగాణ ఎన్నికలలో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు కొన్ని చోట్ల పార్లమెంటు సభ్యులను కూడా బరిలోకి దించాయి. బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక శాసనసభకు పోటీ చేయగా ఆయన గెలుపొందారు. అయితే బీజేపీలో ముగ్గురు ఎంపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బోథ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ లో మాత్రం...
అదే సమయంలో కాంగ్రెస్ కూడా తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించింది. మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ శాసనసభ నుంచి విజయం సాధించారు. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ శాసనసభ్యుడిగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా బీజేపీలో ముగ్గురు ఎంపీలు పోటీ చేసి ఓడిపోగా, కాంగ్రెస్ లో మాత్రం గెలిచారు.
Next Story