Sun Dec 22 2024 10:01:13 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మరో టీఆర్ఎస్?
తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది
తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రక్షణ సమితి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తాను స్థాపించిన టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ టైటిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్కు కష్టమేనా?
బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో కమిటీల నియామకం కూడా చేపట్టారు. అయితే టీఆర్ఎస్ పేరుతో మరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. దాదాపు పథ్నాలుగు ఏళ్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ జనం నోళ్లలో నానింది. అయితే గుర్తు కారు ఇవ్వకపోయినా టీఆర్ఎస్ పేరున వేరే పార్టీ కనుక తెలంగాణలో ఏర్పడితే అధికార పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. తెలుగు రైతు సమితి అని కూడా కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికప్పుడు టీఆర్ఎస్ టైటిల్ ఎవరికీ ఇచ్చే అవకాశం లేదని కూడా న్యాయనిపుణులు చెబుతున్నారు.
Next Story