CM Revanth Reddy: తెలంగాణ బిడ్డలకు నేనున్నా.. : సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 78 వ జన్మదినం వేడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో..
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 78 వ జన్మదినం వేడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క, కాంగ్రెస్ నేతలు వీహెచ్ హన్మంత్‌రావు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 10 ఏళ్లలో కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారని అన్నారు.
మేము ఈ కుర్చీలో ఉన్నమంటే కార్యకర్తల త్యాగమేనని అన్నారు. 2009 డిసెంబర్ 9 న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ ఒడిడుకులు ఎదుర్కున్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. డిసెంబర్ 7 న ఎల్బి స్టేడియంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు తెలంగాణ తల్లి ని చూసారని, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు నేనున్న అంటూ భరోసా ఇచ్చారు సీఎం రేవంత్.
ఎల్బి స్టేడియంలోకి సోనియా గాంధీ ప్రవేశించినప్పుడు ప్రజలు నిల్చొని అభినదించినప్పుడు ఆమె ముఖంలో సంతోషం కలిగింది.. మల్లి అలాంటి రోజు చూడలేం.. పీసీసీ అధ్యక్షులు గా నాకు చాలా సంతోషం కలిగింది.. 2017 డిసెంబర్ 9 న మొదటిసారి గాంధీభవన్ లో కాలు పెట్టానని గుర్తు చేశారు. ఇప్పుడు డిసెంబర్ 9 ముఖ్యమంత్రిగా వచ్చాను.. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. 10 సంవత్సరాల్లో కార్యకర్తలు వేల కేసులు మొస్తున్నారని, వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. ఇందిరమ్మ ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు.