Sun Dec 22 2024 21:36:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు, రేపు 18 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు
ఫలక్ నుమా లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, హైదరాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – హైదరాబాద్
హైదరాబాద్ లోకల్ ట్రైన్ లో ప్రయాణించేవారికి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్ డేట్ ఇచ్చింది. నేడు, రేపు (నవంబర్ 12,13) తేదీల్లో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఫలక్ నుమా లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, హైదరాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – హైదరాబాద్ మార్గాల్లో నడిచే 18 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించి.. సనత్నగర్ – హఫీజ్పేట్ స్టేషన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 12న పన్నెండు రైళ్లు, ఈ నెల 13న ఆరు రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి.. సహకరించాలని కోరారు. ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ప్రయాణికులు మాత్రం వారాంతంలో ఎంఎంటీఎస్ లను ఆపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Next Story