Mon Dec 23 2024 05:49:03 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఇక జోరు వానలే.. జర జాగ్రత్త సుమా
తెలంగాణ లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తెలంగాణలో ఇవి విస్తరించడంతో ఇక జోరు వానులు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది.
తెలంగాణ లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తెలంగాణలో ఇవి విస్తరించడంతో ఇక జోరు వానులు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ మొత్తం, చత్తీస్గఢ్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ మొత్తం, చత్తీస్గఢ్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.
మూడు రోజులు...
రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి. కాగా ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు పడమర మధ్య ద్రోణి సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story