Mon Dec 23 2024 09:17:02 GMT+0000 (Coordinated Universal Time)
పిల్లలతో కలసి పోచారం ఎంజాయ్
బాన్సువాడ పట్టణంలో పర్యటిస్తున్నస్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడి చావడి వద్ద పిల్లలతో కలసి క్రికెట్ ఆడారు
పిల్లలతో కలసి పోయి ఆడుకోవడం కొందరికి సరదా. తమ చిన్ననాటి ఆటలు గుర్తుకు తెచ్చుకునేలా వయసు పై బడినా ఆటలను మాత్రం మరిచిపోరు కొందరు. ముఖ్యంగా పిల్లలతో కలసి ఆడుకోవడాన్ని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఎంతో ఇష్టం. ఆయన అటుగా వెళుతూ పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తే చాలు వెంటనే కారు దిగి వారితో ఆటలాడతారు.
క్రికెట్ ఆడుతూ...
తాజాగా బాన్సువాడ పట్టణంలో పర్యటిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడి చావడి వద్ద క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించడంతో వెంటనే తన కాన్వాయ్ ను ఆపించారు. వాహనం దిగి వెళ్లి బ్యాట్ అందుకున్నారు. వారితో కలసి కాసేపు క్రికెట్ ఆడారు. గల్లీ క్రికెట్ ఆడుతూ పిల్లలతో కలసి స్పీకర్ పోచారం ఎంజాయ్ చేయడం పలువురిని ఆకట్టుకుంది.
Next Story