Mon Dec 23 2024 05:09:55 GMT+0000 (Coordinated Universal Time)
మరో ఇద్దరి అరెస్ట్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. సిట్ పోలీసులు భగవంత్కుమార్, అతని సోదరుడు రవికుమార్లను అరెస్ట్ చేశారు. దీంతో ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 22కు చేరుకుంది. తన సోదరుడు రవి కుమార్ కోసం భగవంత్ కుమార్ డాక్యానాయక్ నుంచి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
రెండు లక్షలకు...
డాక్యా నాయక్ రెండు లక్షల రూపాయలకు ఈ ప్రశ్నాపత్రం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తేల్చారు. ఇందులో 1.75 లక్షల రూపాయలను భగవంత్ కుమార్ డాక్యానాయక్ ఖాతాలో జమ చేసినట్లు నిర్ధారణ అయింది. డాక్యా నాయక్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన సిట్ అధికారులు వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరెంత మందికి ఈ ప్రశ్నాపత్రాలు అందాయన్న కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది.
Next Story