Mon Dec 23 2024 05:18:00 GMT+0000 (Coordinated Universal Time)
Tspsc : సిట్ దూకుడు.. విచారణకు వారు
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్పీడ్ పెంచింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్పీడ్ పెంచింది. ఇప్పటికే నిందితులను ప్రశ్నించిన సిట్ ఈరోజు టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీతో పాటు బోర్డు సభ్యులను విచారించనుంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శిఅనితా రామచంద్రన్ తో పాటు బోర్డు సభ్యుడు లింగారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోరింది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజేలో ఛైర్మన్ జనార్థన్‌రెడ్డిని కూడా విచారించనుంది.
ఇద్దరినీ...
ఇప్పటికే అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు ప్రవీణ్ అనితా రామచంద్రన్‌కు పీఏగా వ్యవహరిస్తున్నాడు. రమేష్ కూడా టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్ లింగారెడ్డి పీఏగా పనిచేస్తున్నాడు. వీరిని విచారిస్తే అసలు ప్రశ్నాపత్రం ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విషయం బయటపడుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రభుత్వం నియమించిన సిట్ అనేక కోణాల్లో విచారిస్తుంది. అసలు నిందితులను పట్టుకున్నప్పటికీ వీరి వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న అనుమానంతో విచారణను ముమ్మరం చేసింది.
Next Story