Mon Dec 23 2024 05:17:35 GMT+0000 (Coordinated Universal Time)
Tspsc : ఆ వ్యక్తి విదేశాలకు వెళ్లకుండా?
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరొకరికి స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు నోటీసులు జారీ చేశారు
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరొకరికి స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు నోటీసులు జారీ చేశారు. అమెరికా నుంచి వచ్చి పరీక్ష రాసిన ప్రశాంత్ కు ఎల్ఓసీ జారీ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడు రాజశేఖర్ కు ప్రశాంత్ బావ వరస అవుతాడు. ప్రశాంత్ గ్రూప్ వన్ పరీక్షను అమెరికా నుంచి వచ్చి రాశాడు.
అమెరికా వెళ్లకుండా...
విచారణలో ఈ విషయం బయటపడటంతో ప్రశాంత్ విదేశాలకు వెళ్లకుండా సిట్ పోలీసులు ఎల్ఓసీ జారీ చేశారు. ఈ కేసులో నిందితులను రిమాండ్ లోకి తీసుకున్న వారిని ప్రశ్నిస్తుండగా ప్రశాంత్ విషయం బయటపడింది. మరో నిందితుడు ప్రవీణ్ ఇంట్లో నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గ్రూప్ 1 పరీక్ష రాసే సామర్థ్యం లేని వారు ఎంతమంది పరీక్ష రాశారన్న దానిపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు.
Next Story