Mon Dec 23 2024 08:23:07 GMT+0000 (Coordinated Universal Time)
నేడు భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం
భద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై హాజరయ్యారు
భద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏటా సీతారామ కల్యాణం పూర్తయిన మరుసటి రోజు పట్టాభిషేకం నిర్వహిస్తారు. అయితే ఈసారి సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకానికి ఒక ప్రత్యేకత ఉంది. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కర పట్టాభిషేకం నేడు భద్రాద్రిలో జరగనుంది.
భారీ బందోబస్తు...
ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొంటారు. ఆమె నిన్న రాత్రి రైలులో భద్రాచలానికి చేరుకున్నారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. నేడు కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
Next Story