Sun Dec 14 2025 06:02:41 GMT+0000 (Coordinated Universal Time)
Bhadrachalam : భద్రాద్రిలో నేడు శ్రీరామ పట్టాభిషేకం
భద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. మిథిలా స్టేడియంలో జరగనున్న వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు

భద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. మిథిలా స్టేడియంలో జరగనున్న ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు. నిన్న భద్రాద్రిలో సీతారాముల కల్యాణం అత్యంత కమనీయంగా జరిగిన సంగతి తెలిసిందే. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
మరుసటి రోజు...
ఏటా సీతారామ కల్యాణం జరిగిన మరుసటి రోజున శ్రీరాములోరి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ వేడుకను చూసేందుకు నలుమూలల నుంచి అనేక మంది తరలి వస్తారు. నిన్న వచ్చిన వారు నేడు పట్టాభిషేకం వేడుకను చూసి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. మిధిలా స్టేడియంలోనే శ్రీరామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశారు.
Next Story

