Fri Nov 22 2024 22:56:07 GMT+0000 (Coordinated Universal Time)
వారికి రైతు బంధు ఆపండి.. ఎక్సైజ్ శాఖ లేఖ
తెలంగాణలో గంజాయి సాగు చేస్తున్న వారికి రైతు బంధు పథకాన్ని నిలిపేయాలని ఎక్సైజ్ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.
తెలంగాణలో గంజాయి సాగు చేస్తున్న వారికి రైతు బంధు పథకాన్ని నిలిపేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణలో గంజాయి సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించింది. మొత్తం 148 మంది రైతులపై ఎక్సైజ్ శాఖ 121 కేసులు నమోదు చేసింది. వీరందరికీ రైతు బంధు పథకాన్ని నిలిపేయాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఈ జిల్లాల్లో....
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ్ ఖేడ్, జహారాబాద్, వరంగల్, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే గంజాయి సాగు చేస్తున్న రైతులను గుర్తించి వారిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ రైతుబంధు నిలిపేయాలని కోరింది.
Next Story