Mon Dec 23 2024 09:34:38 GMT+0000 (Coordinated Universal Time)
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
సంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.
సంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షను నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను పాఠశాలల్లో ఖచ్చితంగా పాటించాల్సిందేనని సూచించారు.
ప్రయివేటు సంస్థల్లోనూ....
విద్యార్థులు విధిగా మాస్కులు ధరించేలా చూడాలిన, హాస్టల్ విద్యార్థులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధిగా రెండు డోసుల టీకాను తీసుకోవాలని కోరారు. ప్రయివేటు యాజమాన్యాలు కూడా విద్యాసంస్థల్లో శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్ మిషన్లు వినియోగించాలని, వాడకపోతే కఠిన చర్యలుంటాయని ఆమె హెచ్చరించారు.
Next Story