Mon Dec 23 2024 07:13:53 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యాలయంలో జీఎస్టీ సోదాలు
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న కార్యాలయంతో పాటు హైదరాబాద్ లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. సుశి ఇన్ఫ్రా సంస్థకు
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కోమటిరెడ్డికి చెందిన సుశి ఇన్ఫ్రా కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న కార్యాలయంతో పాటు హైదరాబాద్ లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. సుశి ఇన్ఫ్రా సంస్థకు రాజగోపాల్ రెడ్డి సోదరుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన తనిఖీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. తనిఖీల్లో ఏం దొరికాయన్న విషయాన్ని అధికారులు వెల్లడించాల్సి ఉంది.
Next Story