Sun Dec 22 2024 20:36:32 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ కష్టమే.. టీఆర్ఎస్ గానే పోటీ
మునుగోడు లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తామని రాష్ట్ర ప్రణాళి సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు
నామినేషన్లు రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో మునుగోడు లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తామని రాష్ట్ర ప్రణాళి సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చినా ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నారు. ఈరోజే ఎన్నికల కమిషన్ అధికారులను కలసి రాష్ట్ర సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం కాపీని అందచేశామని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ గా పేరు మారడానికి...
అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మారడానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిగానే పోట ీచేస్తారని ఆయన తెలిపారు. ఇక్కడ పేరు మాత్రమే మారిందని, గుర్తు కారు కొనసాగుతుందని వినోద్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ను కలసి వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ గా ఎన్నికల కమిషన్ గుర్తించేంత వరకూ టీఆర్ఎస్ గానే కొనసాగుతుందన్నారు.
Next Story