Mon Dec 23 2024 04:20:41 GMT+0000 (Coordinated Universal Time)
BRS : నేడు బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నేడు బీఆర్ఎస్ లో చేరనున్నారు
బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నేడు బీఆర్ఎస్ లో చేరనున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా వేసుకోనున్నారు. దీనిపై ఆయన ట్వీట్ చేశఆరు. “నా రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు" అంటూ ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను...
తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నానని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటానని, . వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని ప్రవీణ్ కుమార్ ఈమేరకు ట్వీట్ చేశారు. నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరనున్నారు.
Next Story