Wed Dec 25 2024 14:30:04 GMT+0000 (Coordinated Universal Time)
వెక్కివెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే
తనపై కుట్రలు చేస్తున్నారంటూ స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య వెక్కివెక్కి ఏడ్చారు
తనపై కుట్రలు చేస్తున్నారంటూ స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య వెక్కివెక్కి ఏడ్చారు. ఫాదర్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. 63 ఏళ్ల వయసులో తనపై లైంగిక వేధింపులు ఆరోపణలు చేస్తున్నారని రాజయ్య విలపించారు. తనను రాజకీయంగా ఎదుర్కన లేక తన ప్రత్యర్థులు ఇలాంటి గేమ్ ఆడుతున్నారని ఆయన అన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనను నేరుగా ఎదుర్కొనలేకనే ఈ రకమైన ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు.
మహిళలను అడ్డంపెట్టుకుని...
మహిళలను అడ్డంపెట్టుకుని తనపై కుట్రలు మొదలయ్యాయని రాజయ్య ఆరోపించారు. తనకు జనబలం ఉందని, అది ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారన్నారు. ఏ సర్వే చూసినా తాను ముందు వరసలో ఉన్నానని తేలుతుందని, తాను ఘన్పూర్ కు ఐదోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని రాజయ్య తెలిపారు. తనకు సర్పంచ్ నవ్య బిడ్డ లాంటిదని రాజయ్య పేర్కొన్నారు. తన చివరి ఊపిరి ఉన్నంత వరకూ ప్రజల మధ్యనే ఉంటామని, ప్రజల మధ్యనే ఛస్తానని అంటూ రాజయ్య ఏడుస్తూ ఒక్కసారి కుప్పకూలిపోవడంతో పక్కనున్న నేతలు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు.
Next Story