Mon Dec 23 2024 17:42:35 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి నాలుగురోజులు సమతామూర్తి సందర్శనం నిలిపివేత !
ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తులు సమతామూర్తిని దర్శించుకోవచ్చని వెల్లడించింది. సమతామూర్తి కేంద్రం..
హైదరాబాద్ : ముచ్చింతల్ శ్రీరామనగరంలోని శ్రీరామానుజచార్య దర్శనాలను నాలుగు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు సమతామూర్తి కేంద్రం ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ సమతామూర్తి కేంద్రంలో అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులను సందర్శనకు అనుమతించడం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి యథాతథంగా భక్తులను సందర్శనకు అనుమతించనున్నట్లు పేర్కొంది.
ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తులు సమతామూర్తిని దర్శించుకోవచ్చని వెల్లడించింది. సమతామూర్తి కేంద్రం ప్రవేశరుసుంలో ఎలాంటి మార్పు లేదని, ఎప్పటి లాగే ప్రతి బుధవారం కేంద్రానికి సెలవు ఉంటుందని పేర్కొంది. అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదని మరోసారి స్పష్టం చేసింది. కేంద్రంలోకి సెల్ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని తెలిపింది. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలని సూచించారు. ఎలాంటి ఆహార పానీయాలకు లోపలికి అనుమతి లేదని.. ఈ నిబంధనలను భక్తులంతా పాటించాలని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Next Story