Mon Dec 23 2024 16:56:33 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ కొత్త రూపు
తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తయారు చేయించింది. దీనిని సోషల్ మీడియాలో విడుదల చేశారు
కాంగ్రెస్ పార్టీ సెప్టంబరు 17 సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణకు ప్రత్యేక జెండా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం దొరల ప్రతిరూపంగా కనపడుతుందని, అందుకే సబ్బండ వర్గాలకు దగ్గరగా ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన చెప్పారు.
సబ్బండ వర్గాల....
దీంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తయారు చేయించింది. దీనిని సోషల్ మీడియాలో విడుదల చేశారు. తెలంగాణ తల్లి సామాన్యులకు ప్రతిరూపంగా ఉండేలా తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం బంగారు కిరీటం, వజ్ర వైఢూర్యాలను ధరించి దొరలకు ప్రతిరూపంగా ఉందని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని సెప్టంబరు 17న ఆవిష్కరించనున్నారు.
Next Story