Tue Mar 18 2025 14:24:07 GMT+0000 (Coordinated Universal Time)
డీకే అరుణ ఇంట్లో ప్రవేశించిన ఆ ఆగతంకుడు ఏం చేశాడో తెలుసా?
బీజేపీ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ ఇంట్లో ఆగంతుకుడు చొరబడటం కలకలం రేపింది

బీజేపీ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ ఇంట్లో ఆగంతుకుడు చొరబడటం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 56లోని ఆమె నివాసంలో దుండగుడు ప్రవేశించి గంటన్నర పాటు ఇంట్లోనే తిరిగినట్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆగంతుకుడు చేతులకు గ్లౌజులు వేసుకుని, ముఖానికి ముసుగు ధరించి వచ్చాడని పోలీసులు తెలిపారు.
తెల్లవారు జామున...
ఈరోజు తెల్లవారు జామున డీకే ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు అక్కడే తచ్చాడి వెళ్లిపోవడంతో డీకే అరుణ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఉన్న తన ఇంటికి భద్రతలేదని డీకే అరుణ అన్నారు. తనకు భద్రత పెంచాలని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కిచెన్ లోకి వెళ్లిన ఆగంతకుడు అక్కడే గంటన్నర సేపు ఉండి చివరకు ఎంపీ గదిలోకి కూడా కూడా వచ్చారన్నారు. అయితే ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story