Mon Dec 23 2024 09:27:41 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రెండో రోజు జూడాల సమ్మె.. అవస్థలు పడుతున్న రోగులు
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. నిన్న జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జరిపిన చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి మంత్రి వద్ద నుంచి సరైన క్లారిటీ రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు నేడు కూడా సమ్మె చేస్తున్నారు.
డిమాండ్ల పరిష్కారానికి...
జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో అవుట్ పేషెంట్ వార్డులో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ సేవలతో పాటు సర్జరీలను కూడా బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకూ సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. అయితే జూడాల సమ్మెతో రోగులు అనేక ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరసేవల్లో మాత్రమే వాళ్లు పాల్గొంటుండటంతో సాధారణ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా జూడాల సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story