Mon Dec 23 2024 16:38:25 GMT+0000 (Coordinated Universal Time)
బాసర ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపుల కలకలం..
తాజాగా.. కాలేజీలో విద్యార్థినులపై ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఓ విద్యార్థిని తనను ఇద్దరు..
బాసర ట్రిపుల్ ఐటీలో తరచూ ఏదొక వివాదం తలెత్తుతోంది. మొన్నటి వరకూ హాస్టల్ లో వసతులు సరిగ్గా లేవంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్లను తీరుస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనలను విరమించారు. తాజాగా.. కాలేజీలో విద్యార్థినులపై ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఓ విద్యార్థిని తనను ఇద్దరు ఉద్యోగులు లైంగికంగా వేధించారంటూ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఇద్దరు ఉద్యోగులను విధుల నుండి సస్పెండ్ చేశారు. వారిద్దరి సెల్ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్థులు.. తోటి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story