Mon Dec 23 2024 18:13:26 GMT+0000 (Coordinated Universal Time)
ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్ ను పట్టుకున్న విద్యార్థి..
ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం ప్రిన్సిపాల్ ను పట్టుకునేందుకు..
ఒంటికి నిప్పంటించుకున్న విద్యార్థి.. వెంటనే ప్రిన్సిపాల్ ను పట్టుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ రామంతాపూర్ లోని నారాయణ కాలేజీలో జరిగిందీ ఘటన. బాధిత విద్యార్థి అదే కాలేజీలో చదువుతున్నాడు. కొంతకాలంగా విద్యార్థి ఫీజు చెల్లించకపోవడంతో.. కాలేజీ యాజమాన్యం నుంచి ఫీజు చెల్లించాలంటూ వేధింపులు ఎక్కువయ్యాయి. దాంతో విసుగు చెందిన విద్యార్థి శుక్రవారం పెట్రోల్ బాటిల్ ను వెంట తెచ్చుకున్నాడు.
ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం ప్రిన్సిపాల్ ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ కు నిప్పంటుకుంది. కాలేజీ సిబ్బంది అప్రమత్తమై మంటలార్పగా.. అప్పటికే ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటన చూసిన విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాలేజీ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్త్ ను ఏర్పాటు చేశారు.
Next Story