Mon Dec 23 2024 01:14:21 GMT+0000 (Coordinated Universal Time)
బడిలో భూతం అంటూ ప్రచారం.. టీచర్ ఏమి చేశారంటే?
ఆ పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు కొంతకాలంగా భయపడుతున్నారు. దీంతో
అరె మన స్కూల్ లో దెయ్యం ఉందట రా..?
నీకేమి తెలుసురా.. ఈ స్కూల్ ఒకప్పుడు శ్మశానం.. దాని మీదనే ఈ స్కూల్ ను కట్టారు.
అవునురా.. నేను కూడా బాత్ రూమ్ కు వెళ్ళినప్పుడు నన్ను ఫాలో అయినట్లు అనిపించింది. భయం తో పాస్ కూడా పోసుకోకుండా వచ్చేశా!!
ఇలా చిన్న పిల్లలప్పుడు మాట్లాడుకునే ఉంటాం. ఇప్పటి వాళ్లు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వదంతులే చివరికి పెద్దవైతే.. అది నమ్మి పిల్లలను స్కూల్ కు పంపించడానికి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తే!! అందుకే ఇలాంటి వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అమావాస్య రోజు హాయిగా నిద్రపోయారు. దెయ్యాలు-భూతాలు లేవంటూ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ధైర్యాన్ని నింపారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆనందపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.
ఆ పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు కొంతకాలంగా భయపడుతున్నారు. దీంతో అమావాస్య రోజు రాత్రి ఒంటరిగా పాఠశాలలో నిద్రించి దెయ్యం లేదని నిరూపించి విద్యార్థుల్లోని అనుమానాలను, భయాన్ని దూరం చేశారు ఉపాధ్యాయుడు రవీందర్రెడ్డి. జులై 2న ఉపాధ్యాయుడు (జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి) నూతల రవీందర్రెడ్డి బదిలీపై వచ్చారు. ఓ రోజు తరగతి గదిలో పాఠం చెబుతుండగా బయట శబ్దం రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకు భయపడుతున్నారని అడగ్గా బడిలో దెయ్యం ఉందన్నారు.. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి రవీందర్ ఈ అమావాస్య రాత్రి సమయంలో ఒంటరిగా పాఠశాలలో పడుకున్నారు. ఆయనకు ఏమీ అవ్వకపోవడం.. తాము నమ్మిన దాన్లో నిజం లేదని తెలియడంతో విద్యార్థులు సంతోషించారు.
Next Story