Mon Dec 23 2024 10:40:20 GMT+0000 (Coordinated Universal Time)
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల రెండో రోజు ఆందోళన.. మంత్రుల హామీ
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన కొనసాగిస్తున్నారు. క్లాస్ లను బహిష్కరించి వర్షంలోనే తమ ఆందోళనలను చేస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన కొనసాగిస్తున్నారు. క్లాస్ లను బహిష్కరించి వర్షంలోనే తమ ఆందోళనలను చేస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీనిపై స్పందించారు. ఈరోజు వైస్ ఛాన్సిలర్ తో సమావేశం నిర్వహిస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. విద్యార్థులు ఆందోళన విరమించి తమ క్లాసులకు వెళ్లాలని కోరారు.
సమస్యలు పరిష్కరించాలని...
అదే సమయంలో మంత్రి కేటీఆర్ కూడా ట్రిపుల్ ఐటీ బాసర విద్యార్థుల ఆందోళనలపై స్పందించారు. సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. విద్య ప్రమాణాలను పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులు గత రెండు రోజులుగా ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని, వైఎస్ ఛాన్సిలర్ ఇక్కడే ఉండి విధులు నిర్వహించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు హామీ ఇచ్చినా ఇక్కడకు వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపే వరకూ ఆందోళన విరమంచబోమని చెబుతున్నారు.
Next Story