Sun Dec 14 2025 05:57:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణలో పాఠశాలలు బంద్
దేశవ్యాప్తంగా నేడు పాఠశాలలు, కళాశాలలకు బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి

దేశవ్యాప్తంగా నేడు పాఠశాలలు, కళాశాలలకు బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, పీడీఎస్ఓ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి.
తెలంగాణ, ఏపీలోనూ...
ీఈరోజు దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బంద్ కు పిలునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లు, కళాశాలలు రేపు స్వచ్ఛందంగా మూసి వేయాలని విద్యార్థి సంఘ నేతలు కోరారు. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏను రద్దు చేయాలని ఈ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. అయితే ఈరోజు తెలంగాణలో పాఠశాలలను, కళాశాలలను మూసివేశారు.
Next Story

