Sun Dec 14 2025 18:11:32 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ
మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై ఏర్పాటయిన ఉపసంఘం సమావేశమై విధివిధానాలను నిర్ణయించనుంది.

తెలంగాణలో మంత్రి వర్గ ఉప సంఘంనేడు భేటీ కానుంది. మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై ఏర్పాటయిన ఉపసంఘం సమావేశమై విధివిధానాలను నిర్ణయించనుంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ప్రకటించడంతో అందుకు తగినట్లుగా ఉపసంఘం సమావేశమై చర్చించి సిఫార్సులను చేయనుంది.
ప్రజల నుంచి ...
ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘం పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వారి అభిప్రాయాలతో పాటు ప్రభుత్వ ఆర్థికపరిస్థితులు, రైతులకు అందరికీ ఉపయోగపడేలా మంత్రి వర్గం సిఫార్సులు చేయనుంది. అయితే నేడు విధివిధానాలను ఖరారు చేసిన తర్వాత దానిని ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నెల 4వ తేదీన జరిగే మంత్రి వర్గసమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించనుంది.
Next Story

