Mon Dec 23 2024 04:51:46 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు కొత్త ఎన్నికల కమిషనర్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్‌రెడ్డి నియమించారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్‌రాజును ఎన్నికల కమిషన్ రిలీవ్ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వికాస్ రాజ్ ను రిలీవ్ చేయడంతో ఆయన తిరిగి పోస్టింగ్ ఇవ్వనున్నారు.
వికాస్ రాజ్ స్థానంలో...
వికాస్ రాజ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా అనేక ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. అందుకే ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వికాస్ రాజ్ కు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నది తెలియాల్సి ఉంది.
Next Story