Mon Dec 23 2024 13:22:13 GMT+0000 (Coordinated Universal Time)
సుఖేష్ అలా ఎందుకు అన్నాడో?
200 కోట్ల ఛీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు
200 కోట్ల ఛీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ కు తాను 75 కోట్లు డబ్బులు ఇచ్చానని చెప్పారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఈ డబ్బులు తాను 2020లో ఈ డబ్బులు చెల్లించినట్లు తెలిపారు. కేజ్రీవాల్ తరుపున బీఆర్ఎస్ ఆఫీస్లో 75 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సుఖేష్ చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకు కోడ్ వర్డ్స్ కూడా ఉపయోగించినట్లు సుఖేష్ చంద్రశేఖర్ తెలిపారు.
75 కోట్ల రూపాయలను...
కేజ్రీవాల్ తో తాను జరిపిన మొత్తం 700 పేజీల టెలిగ్రాఫ్, వాట్సాప్ ఛాట్ లు తన వద్ద ఉన్నాయని, ఆపరేషన్ కోడ్ వర్డ్ పదిహేను కిలోల నెయ్యి అని సుఖేష్ చంద్రశేఖర్ తెలిపాడు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి విముక్తి కల్పిస్తానంటూ కొందరు వ్యాపార వేత్తలను మోసం చేసిన కేసులో సుఖేష్ చంద్రశేఖర్ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే సుఖేష్ చంద్రశేఖర్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు. అది బీజేపీ ఆడుతున్న డ్రామా అని తెలిపారు.
Next Story