Tue Feb 25 2025 16:57:24 GMT+0000 (Coordinated Universal Time)
మండే ఎండలు.. ఎల్లో అలెర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఏపీలోనూ...
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 37 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ తగిలే అవకాశముందని, నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story