Tue Dec 24 2024 01:21:21 GMT+0000 (Coordinated Universal Time)
చేరికలపై దృష్టి పెట్టండి.. బన్సల్ పిలుపు
ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను గుర్తించి వెంటనే వారిని పార్టీలోకి తీసుకు రావాలని సునీల్ బన్సల్ తెలిపారు
ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను గుర్తించి వెంటనే వారిని పార్టీలోకి తీసుకు రావాలని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ తెలిపారు. ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేయాలని నాయకులను ఆదేశించారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను...
అలాగే రంగారెడ్డి,, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా దృష్టి సారించాలని నేతలకు చెప్పారు. ప్రజా గోస, బీజేపీ భరోసా, పార్లమెంటు ప్రవాస్ కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా వేగవంతం చేయాలని సునీల్ బన్సల్ పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన నేతలను ఆదేశించారు.
- Tags
- sunil bansal
- bjp
Next Story