Thu Dec 19 2024 03:58:04 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : 27కు వాయిదా
ఎమ్మెల్యేల కొనుగోలు కేసువిచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసువిచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈరోజు ఈ కేసు విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీన విచారిస్తామని తెలిపింది. దీంతో మరికొద్ది రోజులు సీబీఐ అధికారులు దీనికి సంబంధించిన రికార్డుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీీబీఐకి రికార్డులు...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి హైకోర్టు ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు తమకు ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఐదు సార్లు లేఖలు రాసినా ఇవ్వలేదు. దీంతో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
Next Story