Thu Dec 19 2024 03:43:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే హవా
తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే హవా అని టౌమ్స్ నౌ, ఈటీజీ సర్వే సంస్థ ప్రకటించింది
తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే హవా అని టౌమ్స్ నౌ, ఈటీజీ సర్వే సంస్థ ప్రకటించింది. లోక్‌సభ స్థానాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు చేజిక్కించుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. తర్వాత స్థానంలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి.
అత్యధిక స్థానాల్లో...
తెలంగాణలో ఉన్న పార్లమెంటు స్థానాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు టైమ్స్ నౌ, ఈటీజీ సర్వే సంస్థ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు ఎనిమిది నుంచి పది స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ మూడు నుంచి ఐదు స్థానాలను, బీజేపీ మూడు నుంచి ఐదు స్థానాలను, ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకుంటాయని తేల్చింది.
Next Story