Mon Dec 23 2024 04:24:12 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ కొత్త సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్
తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఏడు
తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను అప్పగించారు. ఈ రోజే సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్ భవన్‌కు ప్రమాణ స్వీకార సామాగ్రిని తరలిస్తున్నారు. రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలించారు. సీఎం ఎవరన్నది, డిప్యూటీ సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని సీఎల్పీ అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. తెలంగాణ సీఎం ఎవరన్నది ఎమ్మెల్యేలందరితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారని డీకే శివకుమార్ వెల్లడించారు. అందరితో చర్చించి సీఎం పేర్లను సీల్డ్ కవర్లో హైకమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఈరోజు తుది నిర్ణయం ప్రకటిస్తామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
Next Story