Tue Mar 18 2025 17:37:01 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో ముంతాజ్ హోటల్ కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా
తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్‌కు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామిజీలు ఆందో ళనకు దిగారు

పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్‌కు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామిజీలు ఆందో ళనకు దిగారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఇప్పటివరకు నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలిపిరిలో దీక్ష ప్రారంభించిన స్వామిజీలు పాదయాత్రగా తిరుమలకు వెళ్లనున్నారు.
పవన్ జోక్యం చేసుకోవాలి...
కాగా తిరుపతి సమీపంలోని పేరూరు వద్ద 20 ఎకరాలను 60 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ 2022లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ లీజును రద్దు చేయాలని, తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మించవద్దంటూ స్వామీజీలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story