Mon Dec 23 2024 04:57:11 GMT+0000 (Coordinated Universal Time)
పెట్టెలనిండా నోట్ల కట్టలాయె.. తహసీల్దార్ ఇంట్లో
నల్గొండ జిల్లా మర్రిగుడ తహసీల్దార్‌గా పని చేస్తున్న మహేందర్ రెడ్డి ఇంటిపై
నల్గొండ జిల్లా మర్రిగుడ తహసీల్దార్‌గా పని చేస్తున్న మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మహేందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. హైదరాబాద్ వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయినగర్‌లో ఉన్న మహేందర్ రెడ్డి నివాసంతో పాటు 15 చోట్ల సోదాలు నిర్వహించారు. దాడులు చేసిన ఏసీబీ అధికారులు భారీగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారాన్ని గుర్తించారు.
మహేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన వాటిలో ఒక ట్రంకు పెట్టెలో ఏకంగా రూ. 2 కోట్లకు పైగా నగదు దొరికింది. నగదుతో పాటు మహేందర్ ఇంట్లో కిలోల కొద్ది బంగారాన్ని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహేందర్ రెడ్డి పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. మహేందర్ రెడ్డికి సంబంధించిన వారి ఇళ్లు కార్యాలయాల్లో కలిసి మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహించారు.
Next Story