Mon Dec 23 2024 02:17:55 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు పల్నాడులో ప్రజాగళం
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభ నేడు పల్నాడు లో జరగనుంది. ఆయన పెదకూరపాడు, సత్తెనపల్లి లో పర్యటించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత ప్రజాగళం సభ నేడు పల్నాడు జిల్లాలో జరగనుంది. ఆయన పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటనను ముగించుకుని వచ్చిన చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. క్రోసూరు, సత్తెనపల్లిలలో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. పార్టీ నేతలు ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేతలతో నేరుగా...
ప్రజాగళం పేరిట చంద్రబాబు వరసగా నియోజకవర్గాలు చుట్టివస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అభ్యర్థులతో కూడా సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. టిక్కెట్ రాని నేతలను ఈ పర్యటనలో ఆయన బుజ్జగించనున్నారు. అందరినీ కూర్చుని బెట్టి స్వయంగా మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దనున్నారు.
Next Story