Mon Dec 23 2024 04:33:36 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా పిలిస్తేనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు
అమిత్షా ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
అమిత్షా ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని ఆయన తెలిపారు. చంద్రబాబు బీజేపీ నేతలతో ఏం మాట్లాడిందీ, వారి మధ్య జరిగిన చర్చల వివరాలను త్వరలో పార్టీ పెద్దలకు వివరించనున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఫేక్ వీడియోలతో...
అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే చర్చల విషయాలను మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. చంద్రబాబుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అచ్చెన్నాయుడు మండి పడ్డారు. బీజేపీ నేతల కాళ్లు మొక్కడం వైసీపీ సంస్కృతి అని ఆయన అన్నారు. టీడీపీకి ఆ అవసరం లేదని, వైసీపీ ఫేక్ పోస్టులను పెట్టేవారిని వదిలిపెట్టమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Next Story