Mon Dec 23 2024 03:11:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టెట్ పరీక్షలు
తెలంగాణలో నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు
తెలంగాణలో నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. ఇందుకోసం 1,139 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండో ప్రశ్నాపత్రం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ జరుగుతుంది. ఈ పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ 1 కు 2,69,557 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పేపర్ 2కకు మాత్రం 2,08,498 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
పకడ్బందీగా పరీక్షలు...
టెట్ పరీక్ష సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పరీక్షలు జరిగే స్కూళ్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమయినా ఎవరినీ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టిక్కెట్ తో పాటు ఐడెంటిటీ ప్రూఫ్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని అధికారులు ఆదేశించారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించరు. బ్లాక్ పాయింట్ పెన్ నే ఉపయోగించుకోవాలి.
Next Story